శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 27, 2020 , 11:04:11

క‌రోనాను వాడుకుంటున్న చైనా

క‌రోనాను వాడుకుంటున్న చైనా

కోవిడ్‌-19 వైర‌స్ విష‌యంలో చైనాపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక అనుమానాలు ఉన్నాయి. ప్ర‌పంచాన్ని మొత్తం త‌న గుప్పిట్లో పెట్టుకొనేందుకే చైనా ఈ వైర‌స్‌ను సృష్టించింద‌ని ప‌శ్చిమ‌దేశాల్లో బ‌లంగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. చైనా క‌ద‌లిక‌లు కూడా ఈ అనుమానాల‌కు తావిస్తున్నాయి. దేశాల‌న్నీ క‌రోనాతో పోరాటంలో బిజీగా ఉన్న స‌మ‌యం చూసి అనేక దేశాల్లో కంపెనీల‌ను చైనా      కంపెనీలు కొనేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ద‌క్షిణ చైనా స‌ముద్రంలో వివాదాస్ప‌ద కార్య‌క‌లాపాలు చైనా పెంచింది. వూహాత్మ‌కంగా కీల‌క‌మైన ద‌క్షిణ చైనా స‌ముద్ర మొత్తం త‌న‌దేనంటూ చైనా ఎప్ప‌టినుంచో వాదిస్తూ వ‌స్తున్న‌ది. తాజాగా స‌ముద్రంలోని 80 భౌగోళిక ప్రాంతాల పేర్లు మార్చింది. వాటిల్లో 25 ద్వీపాలు, 55 స‌ముద్ర‌గ‌ర్భ ప్ర‌దేశాలు ఉన్నాయి. 

నిజానికి ద‌క్షిణ చైనా స‌ముద్రంపై దాని చుట్టూ ఉన్న దేశాల‌న్నింటికీ హ‌క్కు ఉంద‌ని అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం గ‌తంలో తీర్పు ఇచ్చింది. కానీ ఈ తీర్పును చైనా ఖాత‌రు చేయ‌లేదు. ద‌క్షిణ‌చైనా స‌ముద్ర‌మే కాకుండా హిందూమ‌హా స‌ముద్రంపై కూడా ప‌ట్టుకోసం శ్రీ‌లంక‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్ మ‌య‌న్మార్ వంటి దేశాల‌ను గుప్పిట ప‌డుతున్న‌ది. చైనా తాజా చ‌ర్య‌ల‌పై ద‌క్షిణ చైనా స‌ముద్ర స‌మీప దేశాల‌తోపాటు భార‌త్‌, అమెరికా కూడా తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తంచేశాయి.  logo