సోమవారం 06 జూలై 2020
International - Jun 30, 2020 , 09:45:35

వివాదాస్ప‌ద‌ హాంగ్‌కాంగ్ చ‌ట్టానికి చైనా ఆమోదం

వివాదాస్ప‌ద‌ హాంగ్‌కాంగ్ చ‌ట్టానికి చైనా ఆమోదం

హైద‌రాబాద్‌:  వివాదాస్పద హాంగ్‌కాంగ్ భ‌ద్ర‌తా చ‌ట్టానికి.. చైనా ఆమోదం తెలిపింది.  ఆ దేశ అత్యున్న‌త ప్ర‌తినిధుల స‌భ హాంగ్‌కాంగ్ చ‌ట్టానికి ఏక‌గ్రీవ ఆమోదం తెలిపింది.  బిల్లుకు అనుకూలంగా మొత్తం 162  ఓట్లు పోలైన‌ట్లు తెలుస్తున్న‌ది.  జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టం పాసైన తీరు ప‌ట్ల హాంగ్‌కాంగ్‌లో ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. చైనా ప‌ట్ల హాంగ్‌కాంగ్‌లో ఎటువంటి జాతి వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు జ‌రిగినా.. ఈ కొత్త చ‌ట్టం ప్ర‌కారం వారిని క‌ఠినంగా శిక్షించ‌నున్నారు.  ఈ చ‌ట్టాన్ని వ్య‌తిరేకిస్తూ హాంగ్‌కాంగ్‌లో గత ఏడాది భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిగాయి. కొత్త చ‌ట్టం ఆమోదం వ‌ల్ల‌.. హాంగ్‌కాంగ్ సిటీ గుర్తింపుకు ప్ర‌మాదం ఏర్ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు విమ‌ర్శ‌కులు చెబుతున్నారు. 

చైనా ఆమోదించిన జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టం వ‌ల్ల హాంగ్‌కాంగ్ త‌న న్యాయ‌ స్వేచ్ఛ‌ను కోల్పోతుంద‌ని, సిటీ స్వేచ్ఛ కూడా నాశ‌నం అవుతుంద‌ని విమ‌ర్శ‌లు ఆరోపిస్తున్నారు. బ్రిటీష్ ఆధీనంలో ఉన్న హాంగ్‌కాంగ్‌ను.. 1997లో చైనాకు అప్ప‌గించారు. కొన్ని స్వేచ్ఛ‌ల‌కు లోబ‌డి ఆ ప్ర‌క్రియ జ‌రిగింది.  హాంగ్‌కాంగ్ బిల్లును వ్య‌తిరేకిస్తూ మే నెల‌లో అంత‌ర్జాతీయ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి.  అయినా చైనా మాత్రం హాంగ్‌కాంగ్ జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టాన్ని త‌యారు చేసింది.logo