ఆదివారం 05 జూలై 2020
International - Jun 19, 2020 , 11:03:34

బీజింగ్‌లో మరో 25 కరోనా కేసులు

బీజింగ్‌లో మరో 25 కరోనా కేసులు

బీజింగ్‌: కరోనా పుట్టిళ్లు చైనాలో మరోమారు కరోనా కేసులు పెరుగుతున్నాయి. రెండో దశ కేంద్రంగా మారిన బీజింగ్‌లో కొత్తగా 25 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో గత వారం రోజుల్లో కరోనా కేసులు 183కి చేరాయని నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ (ఎన్‌హెచ్‌సీ) వెల్లడించింది. మార్చి 30 తర్వాత దేశంలో కొత్తగా కరోనా కేసులు జూన్‌ 11న వెలుగులోకి వచ్చాయి. దీంతో వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి బీజింగ్‌లో లాక్‌డౌన్‌ విధించింది. 

కాగా, ప్రభుత్వం తీసుకున్న చర్యలతో బీజింగ్‌లో కరోనా కేసులు తగ్గాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 11న మొదటి పాజిటివ్‌కు నమోదైన తర్వాత రాజధానిలోని మార్కెట్లను మూసివేయడంతోపాటు, ప్రజలు బయటికి రాకుండా డజన్ల కొద్ది నివాస సముదాయాలను పూర్తిగా నిర్బంధంలోకి తీసుకువచ్చింది. దీనికితోడు వేల సంఖ్యలో న్యూక్లిక్‌ యాసిడ్‌ టెస్టులను నిర్వహించింది. రాజధానిలో కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదవతుండటంతో చైనా ప్రభుత్వం తాజాగా వైరస్‌ జీనోమ్‌ డాటాను విడుదల చేసింది.


logo