శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
International - Jan 23, 2021 , 19:21:51

కంబోడియాలో క్రేజీ ‘బీరు యోగా’!

 కంబోడియాలో క్రేజీ ‘బీరు యోగా’!

బమ్ చిక్ బం చేయి బాగా.. ఒంటికి యోగా మంచిదేగా.. అంటూ అప్పుడెప్పుడో రమ్యకృష్ణ చెప్పింది. అదే సూత్రాన్ని ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు అనుసరిస్తూ ఫిట్‌నెస్‌ సాధిస్తున్నారు. మరికొందరేమో యోగా గురువులుగా మారి పాఠాలు నేర్పుతున్నారు. ఇప్పటికే డాగ్‌ యోగా, గోట్‌ యోగా, ఏరియల్‌ యోగా వంటివి అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి కొత్తగా వచ్చి చేరింది బీర్‌ యోగా. అదేంటి బీర్‌కు యోగాతో సంబంధం ఏంటనే కదా మీ సందేహం! ఈ బీర్‌ యోగా కథాకమామిషూ ఏంటంటే..


కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా యువత మానసికంగా కుంగిపోయారు. ఈ మానసిక కుంగుబాటు నుంచి యువతను బయటపడేసేందుకు తీసుకొచ్చిన బీర్‌ యోగాకు విశేష స్పందన కనిపిస్తోంది. కంబోడియా రాజధాని ఫెనమ్ పెన్హ్‌లో కరోనా లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో టూ బర్డ్స్ క్రాఫ్ట్ బీర్ బ్రూవరీ తన సేవలను తిరిగి ప్రారంభించింది. ఇప్పుడు మరింత కొత్తగా తన బీర్‌ యోగాతో యువతను ఉర్రూతలూగిస్తున్నది. కంబోడియా దేశంలో ప్రారంభించిన ఈ 'బీర్ యోగా' విశేష ప్రాచుర్యం పొందింది. ఇక్కడ వ్యాయామం ఉల్లాసంతో కలిపి ఉండటం విశేషం. ఒక్కో యోగా భంగిమ వేసిన తర్వాత ఒక బీర్‌ సిప్‌ తీసుకోవడం ఈ బీర్‌ యోగాలో ముఖ్యమైనది. ఈ బీర్‌ యోగాకు స్థానికులు బాగా రెస్పాండ్‌ అవుతున్నారంట. విదేశీయులు కూడా బీర్‌ యోగాలో పాల్గొంటామంటూ ముందుకు వస్తున్నారంట. బీరు యోగాతో ఆనందంతోపాటు ఉల్లాసం కూడా కలుగుతున్నదని అక్కడి యువకులు బీర్‌ పట్టుకుని భంగిమ వేసి మరీ చెప్తున్నారంటే .. ఈ బీర్‌ యోగా ఎంతగా ప్రాచుర్యం పొందిందో తెలుస్తున్నది. 


అయితే, ఇది అచ్చమైన యోగా సాధన కాదని, కేవలం ఫ్రెండ్స్‌తో కలిసి ఉల్లాసంగా గడపడమేనంటున్నారు ఈ బీర్‌ యోగా నిర్వాహకులు. బీర్‌ యోగాతో ఎందో ఆనందం పొందుతున్నామని, అదే సమయంలో యోగా చేయడంపై ఆసక్తి కూడా పెరుగుతున్నదని స్రేలిన్ బచా అనే యువతి చెప్తోంది. నలుగురితో కలిసి హాయిగా బీరు తాగుతూ, యోగా చేయడాన్ని వారు ఆస్వాదిస్తున్నారు.

బీర్ యోగా ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం కాదు. 2013 లో అమెరికాలోని నెవెడాలో బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్‌ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ బర్నింగ్‌ మ్యాన్‌ ఫెస్టివల్‌కు ప్రజాదరణ పెరిగిపోయింది. దీనిని ప్రేరణతోనే బీర్‌ యోగాను తీసుకొచ్చినట్లు యోగా సాధకురాలు అన్నా చెప్తున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo