మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Aug 24, 2020 , 12:37:33

ఎవ‌రూ లేని స‌మ‌యం చూసి సూప‌ర్‌మార్కెట్‌లో ఎలుగుబంటి చోరీ : వీడియో వైర‌ల్‌

ఎవ‌రూ లేని స‌మ‌యం చూసి సూప‌ర్‌మార్కెట్‌లో ఎలుగుబంటి చోరీ :  వీడియో వైర‌ల్‌

రోజురోజుకి వ‌న్య‌ప్రాణుల అరాచ‌కం పెరిగిపోతున్న‌ది. మొన్న‌టికిమొన్న ఓ ప‌క్షి స్టోర్‌లో ఎవ‌రూ లేని స‌మ‌యం చూసి స్నాక్స్ ప్యాకెట్స్ ప‌ట్టుకుపోయింది. ఇప్పుడు ప‌క్షి కాదు. జంతువు అది కూడా చిన్న‌దేం కాదు. పెద్ద‌దే.. ఎలుగుబంటికి బాగా ఆక‌లిగా ఉన్న‌న్న‌ట్లుంది. ఎక్క‌డా ఆహారం దొర‌క్క‌పోయే స‌రికి సూప‌ర్‌మార్కెట్ మీద క‌న్నుబ‌డింది. ఇంకేముంది మ‌నిషి పోయిన‌ట్లుగా ద‌ర్జాగా లోప‌లికి వెళ్లి న‌చ్చిన స్నాక్స్ ప్యాకెట్స్ బ‌య‌ట‌కు తెచ్చుకొని దొర‌లా తింటున్న‌ది.

ఈ సంఘ‌ట‌న కాలిఫోర్నియాలో చోటుచేసుకున్న‌ది. ఇదంతా అక్క‌డున్న సీసీకెమెరాలో రికార్డైంది. దీన్ని రిటైల‌ర్ వ‌ద్ద ఓ క‌స్ట‌మ‌ర్ స్వాధీనం చేసుకున్న‌ది. దీనిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గానే వైర‌ల్ అయింది. సోష‌ల్ మీడియాలో వ‌న్య‌ప్రాణుల వీడియోల‌తో నిండిపోయింది. 'చోరీ చేయ‌డానికి మ‌నుషులు భ‌య‌ప‌డ‌తారేమో జంతువుల‌కు ఏముంద‌ని' నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. logo