గురువారం 09 జూలై 2020
International - Jun 19, 2020 , 13:47:41

ప‌క్షుల ఆహారం కోసం చెట్టెక్కిన ఎలుగుబంటి ఏం చేసిందంటే..!

ప‌క్షుల ఆహారం కోసం చెట్టెక్కిన ఎలుగుబంటి ఏం చేసిందంటే..!

ఇది వ‌ర‌కు ప‌క్షుల‌కు ఆహారం పెట్టాలంటే పెద్ద ప్లేట్స్‌లోనో లేదా ధాన్య‌పు గింజ‌ల‌ను నేల మీద‌ వేస్తే వ‌చ్చి తినేవి. ఇప్పుడు వీటికి ఏకంగా చెట్టుపైకే ఆహారాన్ని స‌మ‌కూరుస్తున్నారు. బోర్డ్‌ఫీడ‌ర్ త‌యారు చేసి అందులోనే స‌రిప‌డా ఆహారం ఉంచుతున్నారు. పెంచుకునే పెంపుడు జంతువుల‌ను, ప‌క్షుల‌ను ఆప్యాయంగా ద‌గ్గ‌ర‌కు తీసుకొని ఆహారం అందిస్తారు. మ‌రి ఎలుగుబంటుల‌ను ఎవ‌రు చూసుకుంటారు. అందుకే ఆక‌లికి త‌ట్టుకోలేక చెట్టుపైన ప‌క్షుల‌కోసం పెట్టిన ఆహారాన్ని దొంగిలించ‌డానికి చూసిందో ఎలుగుబంటి. ఎక్క‌డో చెట్టుమీదున్న ఫీడ‌ర్ కావాలంటే చెట్టు ఎక్కాల్సిందేగా. చ‌క‌చ‌కా ఎంచెక్కా చెట్టు ఎక్కేసి ఆహారం అందుకునే స‌మ‌యానికి స్కాట్ బిక్స్బీ అనే ట్విట‌ర్ యూజ‌ర్ వచ్చి అడ్డుకున్నాడు.

అత‌ని బిల్డింగ్ ప‌క్క‌నే ఉన్న చెట్టు ఎక్క‌డంతో ఒక్క‌సారిగా బిక్స్బీ హ‌డ‌లిపోయాడు. 'బేర్ డౌన్.. డౌన్..  అంటూ అర‌వ‌సాగాడు. అయినా ఎలుగుబంటి భ‌య‌ప‌డ‌లేదు. త‌న ప్ర‌య‌త్నం తాను చేసింది. బిక్స్బీ గ‌ట్టిగా అర‌వ‌డంతో ఎలుగుబంటి కింద‌కి దిగేసింది. ఈ క్ర‌మంలో బిక్స్బీ త‌న కుక్క‌పిల్ల‌ల‌ను ఎలా అయితే ట్రీట్ చేస్తాడో అచ్చం అలానే ఎలుగుబంటిని అరిచాడు. ఈ వీడియోను ట్విట‌ర్‌లో షేర్ చేస్తూ.. 'ప‌క్షుల ఆహారాన్ని ఎలుగుబంట్లు తిన‌కుండా ఉండేందుకు ఏమైనా టిప్స్ ఉన్నాయా' అనే శీర్షిక‌ను జోడించాడు. ఇప్పుడు ఈ వీడియో వైర‌ల్ అయింది.  దీనిని ఇప్ప‌టివ‌ర‌కు 2.3 లక్షలకు పైగా వీక్షించారు. 6,500 మంది లైక్ చేశారు. బిక్స్బీ అలా అర‌వ‌డం బాగోలేదంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. 


logo