మంగళవారం 24 నవంబర్ 2020
International - Nov 13, 2020 , 19:11:01

అతి పురాతన వృక్షాన్ని వేరేచోటికి తరలించారు..!ఎక్కడంటే?

అతి పురాతన వృక్షాన్ని వేరేచోటికి తరలించారు..!ఎక్కడంటే?

నైరోబీ: అతి పురాతన వృక్షం రోడ్డు మధ్యలో ఉంది. దాన్ని అక్కడినుంచి తొలగించాల్సిన పరిస్థితి. అయితే, పర్యావరణవేత్తల ఆందోళనతో కెన్యా సర్కారు దానిపై గొడ్డలివేటు వేసేందుకు వెనకడుగు వేసింది. దానికి ప్రత్యామ్నాయం ఆలోచించింది. ఆ భారీ వృక్షాన్ని వేర్లతోసహా పెకిలించి, మరోచోటికి విజయవంతంగా మార్చింది. 

ఈ అతిపురాతన భారీ అత్తి(ఫిగ్‌ ట్రీ) చెట్టు కెన్యా రాజధాని నైరోబీలోని వైయాకివే ప్రాంతంలో ఉంది.  నైరోబి నగరంలో ఇటీవల చైనా నిధులతో రహదారి నిర్మాణం చేపట్టారు. రోడ్డు మధ్యలో ఉన్న ఈ వృక్షాన్ని తొలగించవద్దని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో అధ్యక్షుడి ఆదేశాలమేరకు  ఆ దేశంలోని రోడ్ ఏజెన్సీ, కెన్యా నేషనల్ హైవేస్ అథారిటీ సంయుక్తంగా చెట్టును మరోచోటికి మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.  వెంటనే అధ్యక్షుడు డిక్రీ జారీచేశారు. ఆ వృక్షాన్ని వేర్లతో సహా వేరోచోటికి సురక్షితంగా తరలించారు. దీంతో ఆ దేశాధ్యక్షుడు ఉరు కెన్యట్టాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కెన్యాలో అత్యధిక జనాభా కలిగిన కికుయు అనే జాతి సమూహానికి అత్తి చెట్టు పవిత్ర వృక్షం.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.