బుధవారం 03 జూన్ 2020
International - Apr 20, 2020 , 12:56:24

సిడ్నీలో తెరుచుకున్న బీచ్‌లు..

సిడ్నీలో తెరుచుకున్న బీచ్‌లు..

హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియాలో బీచ్‌లు తెరుచుకుంటున్నాయి. సిడ్నీలో మూడు బీచ్‌ల‌ను ఓపెన్ చేశారు.  న్యూ సౌత్ వేల్స్‌లో కేవ‌లం ఆరు కేసులే న‌మోదు అయ్యాయి. వాస్త‌వానికి దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గినా.. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా క‌ఠిన‌మైన లాక్‌డౌన్ ఆంక్ష‌లనే పాటిస్తున్న‌ది. సిడ్నీలోని కూగీ బీచ్‌ను ఓపెన్ చేయ‌డంతో ప్ర‌జ‌లు అక్క‌డి వ‌స్తున్నారు. సోమ‌వారం బీచ్‌లు తెరుచ‌కున్నా.. పెద్ద‌గా ర‌ష్ లేదు. వీకెండ్‌లో భారీ సంఖ్య‌లో జ‌నం బీచ్‌ల‌కు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. బీచ్‌కు వ‌చ్చే వారు ఎవ‌రైనా రెండు మీట‌ర్ల దూరాన్ని పాటించాల్సి ఉంటుంది.


logo