బుధవారం 03 జూన్ 2020
International - May 07, 2020 , 15:22:23

స్పైడర్‌మ్యాన్‌..బ్యాట్‌మాన్‌.. నర్సుబొమ్మ..

స్పైడర్‌మ్యాన్‌..బ్యాట్‌మాన్‌.. నర్సుబొమ్మ..

స్పైడ‌ర్‌మ్యాన్‌, బ్యాట్‌మాన్‌, న‌ర్సు బొమ్మలు.. ఈ మూడు బొమ్మలు ఆడుకునేందుకు ఓ పిల్లాడికి ఇస్తారు. ఆ అబ్బాయికి ఎంతో ఇష్టమైన స్పైడ‌ర్‌మ్యాన్‌, బాట్మాన్ బొబొమ్మలు పక్కకు నెట్టేసి న‌ర్సు బొమ్మను ఎంచుకుంటాడు. క‌రోనా వైర‌స్ సంక్షోభం స‌మ‌యంలో వ్యాధి బారిన ప‌డిన ప్రజల‌కు కాపాడుతున్నది డాక్టర్లు, న‌ర్సులే. వీరే రియ‌ల్ హీరోలు అనేది దీని ముఖ్య ఉద్దేశం. ఇదంతా ఓ చిత్రం చెబుతున్నది. డాక్టర్లు చేస్తున్నకృషికి  బ్యాంసీ ఆర్ట్ ద్వారా కృతజ్ఞతలు తెలియ‌జేశాఆవిష్కరించారు."గేమ్ ఛేంజర్" అనే శీర్షికతో బ్యాంసీ ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. 'మా హాస్పిట‌ల్‌లో క‌లిసి ప‌నిచేస్తున్న వారంద‌రికీ కృతజ్ఞతలుగా బ్యాంసీ సృష్టించిన ఈ అద్భుతమైన ఆర్ట్ చూస్తుంటే చాలా గ‌ర్వంగా ఉంద‌ని' హాస్పిట‌ల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పౌలా హెడ్ చెప్పుకొచ్చింది. బ్యాంసీ ఇదివ‌ర‌కే త‌న ఆర్ట్స్‌తో అంద‌రినీ మంత్రముగ్ధుల్ని చేశాడు. ఇటీవ‌ల  వాష్‌రూమ్‌లోని గోడ‌ల‌ను కాన్వాస్‌గా మార్చుకొని ఎలుక‌ల ఆర్ట్ వేసి అంద‌రినీ ఆశ్చర్యపర్చిన విష‌యం గుర్తుండే ఉంటుంది.


logo