బుధవారం 27 మే 2020
International - Apr 16, 2020 , 15:50:30

పెయింటింగ్ ఆర్టిస్ట్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ఇలా..ఫొటో వైర‌ల్

పెయింటింగ్ ఆర్టిస్ట్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ఇలా..ఫొటో వైర‌ల్

అత‌ని పేరు బ్యాంక్సీ..ఇంగ్లాండ్ చెందిన ప్ర‌ముఖ పెయింటింగ్ ఆర్టిస్ట్. యూకే వీధుల్లో అంద‌మైన క‌ళారూపాల‌తో ఎంతోమంది హృద‌యాల‌ను దోచుకునే బ్యాంక్సీకి..ఇపుడు లాక్ డౌన్ ఉండ‌టంతో బ‌య‌ట‌కు రాలేని పరిస్థితి. అలాగ‌ని ప‌నిచేయ‌కుండా ఉండలేని ప‌రిస్థితి. ఇంకేముంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోంకు ఫిక్స‌య్యాడు.  బ్యాంక్సీ త‌న బ్రెష్ కు ఇంట్లోనే ప‌నిచెప్పాడు. ఇంట్లోని బాత్ రూంను ఎలుక‌ల బొమ్మ‌ల‌తో నింపేశారు.

పెయింటింగ్ తో ఉన్న బాత్ రూమ్ స్టిల్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి..నేను వ‌ర్క్ ఫ్ర‌మ్ చేస్తే మా ఆవిడ‌కు న‌చ్చ‌దు...అని క్యాప్ష‌న్ ఇచ్చాడు. దీనిపై నెటిజ‌న్లు ఫ‌న్నీగా కామెంట్లు పెట్టారు. మురికిగా బాత్ రూంలంటే నాకిష్టం ఉండ‌దు. కానీ నేను ఇలాంటి బాత్ రూంను ఎందుకు కావాల‌నుకుంటాను అని ఓ నెటిజ‌న్ కామెంట్ పెట్టాడు. క్వారంటైన్ లో 365వ రోజు అని మ‌రో నెటిజ‌న్ కామెంట్ పెట్టాడు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo