సోమవారం 30 మార్చి 2020
International - Mar 23, 2020 , 14:26:34

కరెన్సీ నోట్ల‌తో వైర‌స్ వ్యాపిస్తుందా ?

కరెన్సీ నోట్ల‌తో వైర‌స్ వ్యాపిస్తుందా ?

హైద‌రాబాద్‌: కరెన్సీ నోట్ల‌తో వైర‌స్ వ్యాప్తి చెందుతుందా లేదా ? ఈ ప్ర‌శ్న‌కు జ‌ర్మ‌న్ నిపుణులు నో అని స‌మాధానం ఇస్తున్నారు. క‌రెన్సీ నోట్ల నుంచి వైర‌స్ వ్యాపించ‌ద‌ని రాబ‌ర్ట్ కోచ్ ఇన్స్‌టిట్యూట్ నిపుణులు వెల్ల‌డించారు.  బ్యాంకు నోట్ల‌ను ప‌ట్టుకోవ‌డం, ముట్టుకోవ‌డం ద్వారా క‌రోనా వైర‌స్ సోక‌ద‌న్నారు. బ్యాంకు నోట్ల ద్వారా వైర‌స్ సోకిన‌ట్లు ఎటువంటి సంకేతాలు లేవ‌ని ఆర్‌కేఐ హెడ్ లోత‌ర్ వీల‌ర్ తెలిపారు.  కానీ ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఇస్తున్న హెచ్చ‌రిక‌లు మాత్రం మ‌రోలా ఉన్నాయి.  బ్యాంకు నోట్ల‌ను ప‌ట్టుకున్న త‌ర్వాత‌.. చేతుల్ని క‌డుక్కోవాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో త‌న అడ్వైజ‌రీలో సూచించింది.  క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా పాత నోట్ల‌ను ర‌ద్దు చేయాల‌ని ఇటీవ‌ల చైనా భావించింది.  క‌స్ట‌మ‌ర్ల‌కు వీలైనంత వ‌ర‌కు కొత్త నోట్లు ఇవ్వాల‌ని సూచించింది. పాత నోట్ల‌ను క్వారెంటైన్ త‌ర‌హాలో.. డిస్ఇన్‌ఫెక్ట్ చేయాల‌ని చైనా సెంట్ర‌ల్ బ్యాంక్ ఇటీవ‌ల కొన్ని ఆదేశాలు జారీ చేసింది. logo