బుధవారం 03 జూన్ 2020
International - Apr 06, 2020 , 13:11:14

72వేల కోట్ల‌ ప్యాకేజీ ప్ర‌క‌టించిన బంగ్లాదేశ్‌

72వేల కోట్ల‌ ప్యాకేజీ ప్ర‌క‌టించిన బంగ్లాదేశ్‌


హైద‌రాబాద్‌: బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం ఉద్దీప‌న ప్యాకేజీ ప్ర‌క‌టించింది. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కాపాడేందుకు 72వేల కోట్ల (ఎనిమిది బిలియ‌న్ డాల‌ర్ల) ప్యాకేజీని ప్ర‌క‌టిస్తున్న‌ట్లు ప్ర‌ధాని షేక్ హ‌సీనా తెలిపారు. ఆదివారం జాతిని ఉద్దేశించి టీవీలో మాట్లాడిన ఆమె ఈ విష‌యాన్ని చెప్పారు. చిన్న ప‌రిశ్ర‌మ‌ల‌కు ఈ ప్యాకేజీ ఉపయోగ‌ప‌డుతుంద‌ని ఆమె అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు బంగ్లాదేశ్‌లో 117 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 9 మంది మ‌ర‌ణించారు. నిరుద్యోగుల‌కు ఆహారాన్ని అందివ్వ‌నున్న‌ట్లు ప్ర‌ధాని హ‌సీనా తెలిపారు. క‌రోనా భ‌యానికి సామాజిక హ‌ద్దులు లేవ‌ని,  ధ‌నికుల‌కు, పేద‌ల‌కు వైర‌స్ సోకుతోంద‌న్నారు.



logo