శనివారం 30 మే 2020
International - Apr 02, 2020 , 18:06:58

3 వేల మంది ఖైదీల విడుదలకు సన్నాహాలు..

3 వేల మంది ఖైదీల విడుదలకు సన్నాహాలు..

ఢాకా: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా బంగ్లాదేశ్‌ జైళ్ల శాఖ ఖైదీలను విడుదల చేయాలని భావిస్తోంది. కరోనా నేపథ్యంలో జైళ్లను ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. వివిధ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న సుమారు 3 వేల మందిని విడుదల చేసే విషయంపై హోం శాఖకు ఓ ప్రతిపాదన పంపించాం.

చిన్న చిన్న కేసులతో జైళ్లలో మగ్గుతున్న 3 వేల మంది జాబితాను హోంశాఖకు తెలిపాం. హోంశాఖ అనుమతిస్తే..ఆ ప్రతిపాదనను న్యాయశాఖకు పంపిస్తాం. న్యాయశాఖ ఎలాంటి అభ్యంతరం తెలుపకపోయినైట్లెతే ఖైదీలను విడుదల చేస్తామని జైళ్ల శాఖ ఐజీ అబ్రార్‌ హొస్సేన్‌ తెలిపారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo