Attack Banglaw ISKON Temple | బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ దేవాలయంపై దుండగులు దాడి చేశారు. నౌఖాలీ జిల్లాలో శుక్రవారం ఈ దుర్ఘటన చేసుకున్నది. దీనిపై ఇస్కాన్ దేవాలయం అధికారులు ట్విట్టర్ హ్యాండిల్ వేదికగా రియాక్టయ్యారు.
తమ దేవాలయంపై దుండగులు దాడి చేసి విధ్వంసానికి దిగారు. భక్తులపైనా దాడి చేశారు. గాయపడిన ఒక భక్తుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బంగ్లాదేశ్‌లోని హిందువులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇటీవల బంగ్లాదేశ్‌లో వారం రోజులుగా మైనారిటీ అధ్యాత్మిక స్థలాలపై దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో ఒకరు మరణించారని, మరో 18 మందికి గాయాలయ్యాయని బంగ్లాదేశ్ మీడియాలో వార్తలొచ్చాయి.