మంగళవారం 14 జూలై 2020
International - Jun 29, 2020 , 11:59:19

కరోనాతో బంగ్లాదేశ్‌ రక్షణ కార్యదర్శి అబ్దుల్లా కన్నుమూత

కరోనాతో బంగ్లాదేశ్‌ రక్షణ కార్యదర్శి అబ్దుల్లా కన్నుమూత

ధాకా : బంగ్లాదేశ్‌ రక్షణ కార్యదర్శి అబ్దుల్లా అల్‌ మోసీన్‌ (57) కరోనా వ్యాధి సోకి చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. అబ్దుల్లా మే 29న అనారోగ్యంతో ధాకాలోని మిలిటరీ దవాఖాన (సీఎంహెచ్‌)లో చికిత్స పొందుతున్నాడు. కరోనా పరిక్షలు చేయగా పాజిటీవ్‌గా తేలడంతో తరువాత జూన్‌6న ఆయన్ను ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ICU)కు తరలించారు. జూన్‌ 18  నుంచి ఆయన పరిస్థితి విషమించడంతో వైద్యులు ప్రత్యేక వైద్యం అందజేశారు. సోమవారం ఉదయం 8:45 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో వైద్యులు చికిత్సకు ఉపకరించే లోపే అతడి శరీరం సహకరించక 9:30కి మరణించినట్లు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతికి బంగ్లాదేశ్‌ రక్షణ శాఖ సిబ్బంది నివాళులర్పించారు. 


logo