సోమవారం 01 జూన్ 2020
International - Apr 24, 2020 , 13:32:28

బంగ్లాదేశ్‌‌లో ఇఫ్తార్ విందుల‌పై నిషేధం

బంగ్లాదేశ్‌‌లో ఇఫ్తార్ విందుల‌పై నిషేధం

న్యూఢిల్లీ: ర‌ంజాన్‌ పవిత్ర మాసం సందర్భంగా జరిగే ఇఫ్తార్ విందులపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. శుక్ర‌వారం ఉదయం బంగ్లాదేశ్ మత వ్యవహారాల శాఖ ఈ మేరకు ఒక‌ ప్రకటన చేసిన‌ట్టు అక్క‌డి మీడియా వెల్లడించింది. క‌రోనా మహమ్మారి బారిన పడకుండా సామాజిక దూరం పాటించాలనీ, రంజాన్ సందర్భంగా వ్యక్తిగతంగాగానీ, సంస్థలుగానీ ఎవరూ ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయరాదని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఎవ‌రైనా ఈ నిబంధ‌న‌ను అతిక్రమిస్తే.. చ‌ట్ట‌ప‌రంగా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo