శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 12, 2020 , 13:46:26

ముజిబుర్ హ‌త్య‌.. బంగ్లా మాజీ ఆర్మీ ఆఫీస‌ర్‌కు ఉరి

ముజిబుర్ హ‌త్య‌.. బంగ్లా మాజీ ఆర్మీ ఆఫీస‌ర్‌కు ఉరి

హైద‌రాబాద్‌: బంగ్లాదేశ్ పితామ‌హుడు, బంగ‌బంధుగా కీర్తిగాంచిన షేక్ ముజిబుర్ రెహ్మాన్ హ‌త్య‌కు పాల్ప‌డిన మాజీ ఆర్మీ ఆఫీస‌ర్ అబ్దుల్ మ‌జీద్‌ను ఇవాళ ఉరితీశారు.  ఢాకా సెంట్ర‌ల్ జైలులో ఆదివారం రాత్రి 12.01 నిమిషాల‌కు ఉరితీసిన‌ట్లు ప్రిజ‌న్స్ ఐజీ ఏకేఎం ముస్తాఫా క‌మ‌ల్ పాషా తెలిపారు. మెజిస్ట్రేట్‌, పోలీసు ప్ర‌తినిధుల ముందే అత‌న్ని ఉరితీసిన‌ట్లు అధికారి పేర్కొన్నారు. దేశంలో క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఆంక్ష‌లు విధించినా.. చాలా మంది అర్థ‌రాత్రి ఢాకా జైలు ముందుకు భారీ సంఖ్య‌లో వ‌చ్చారు. మ‌జీద్ చివ‌రి కోరిక మేర‌కు ఆయ‌న భార్య‌ను గ‌తి రాత్రి క‌లిశారు. 

బంగ్లాదేశ్ నేత ముజిబుర్ రెహ్మాన్‌ను 1975లో హ‌త్య  చేశారు. అయితే ఆర్మీ ఆఫీస‌ర్ మ‌జీద్ గ‌త 25 ఏళ్ల నుంచి ప‌రారీలో ఉన్నారు. 1975లో జ‌రిగిన మిలిట‌రీ కుట్ర‌లో ప్ర‌స్తుత ప్ర‌ధాని షేక్ హ‌సీనా తండ్రి ముజిబుర్ హ‌త్య జ‌రిగింది.  పాక్ నుంచి స్వాతంత్ర్యం పొందిన నాలుగేళ్ల త‌ర్వాత ముజిబుర్ హ‌త్య‌కు గుర‌య్యారు. అయితే 1996లో హ‌సీనా ప్ర‌ధాని అయిన త‌ర్వాత నిందితుడు మ‌జీద్ ఇండియాకు పారిపోయిన‌ట్లు గుర్తించారు. ముజిబుర్ హ‌త్య కేసులో మ‌జీద్‌ను ఉరితీశారు. క‌రోనా మ‌హమ్మారి నేప‌థ్యంలో మ‌జీద్ గ‌త మార్చి నెల‌లో తిరిగి బంగ్లాలోకి ప్ర‌వేశించిన‌ట్లు గుర్తించారు. ఆ త‌ర్వాత అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు.logo