శనివారం 11 జూలై 2020
International - Jun 19, 2020 , 12:21:27

ప్ర‌పంచంలోనే అతిపెద్ద 'ఎగ్ ట‌వ‌ర్'

ప్ర‌పంచంలోనే అతిపెద్ద 'ఎగ్ ట‌వ‌ర్'

ఇప్ప‌టివ‌ర‌కు క‌ప్స్‌, బాటిల్స్‌తో పిర‌మిడ్ లేదా ట‌వ‌ర్స్‌లా నిర్మించడాన్ని‌ చూశాం. కానీ ఇత‌ను మాత్రం కాస్త భిన్నంగా ప్ర‌య‌త్నించాడు. ఎన్నిరోజుల నుంచి ప్రాక్టీస్ చేశాడో తెలియ‌దు కానీ, ట్విట‌ర్‌లో షేర్ చేసిన వీడియోలో ఫ‌స్ట్ అటెమ్‌కే మూడు కోడిగుడ్ల‌తో ట‌వ‌ర్ క‌ట్టేశాడు. ఇలా చేయాలంటే చాలా నైపుణ్యం క‌లిగుండాలి.

మ‌లేషియాలోని కౌలాలంపూర్‌కు చెందిన మ‌హ్మ‌ద్ ముక్బెల్ మూడు గుడ్ల‌ను వ‌రుస‌గా పేర్చాడు. అంటే.. ఒక‌దానిపై ఒక‌టి చ‌క్క‌గా పేర్చాడు. ఇలా క‌నీసం ఐదు సెకండ్ల‌పాటు ప‌డ‌కుండా నిల‌బెట్టి ప్ర‌పంచ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. 20 ఏండ్ల మ‌హ్మ‌ద్ చేసిన అధ్భుత‌మైన ప్ర‌తిభ‌ను గిన్నిస్ వ‌రల్డ్ రికార్డ్స్ ఇంకా గుర్తించ‌లేదు. వాస్త‌వానికి ఇలా ఎవ‌రూ చేయ‌లేదు. ఈ ట‌వ‌ర్ 'గుడ్ల అతిపెద్ద స్టాక్'గా పేర్కొన్న‌ది. గుడ్ల‌ను ఇలా ఒక‌దానిపై ఒక‌టి నిల‌బెట్ట‌డానికి చిన్న‌ ట్రిక్ ఉంటుంది. జిడబ్ల్యుఆర్ నిబంధనల ప్రకారం గుడ్లు తాజాగా ఉంటేనే ఇలా చేయ‌గ‌ల‌ర‌ని చెప్పుకొచ్చింది. ఏదైతేనేం.. బాలుడి నైపుణ్యాలు, స‌హ‌నాన్ని చాలామంది అభినందిస్తూ ఈ వీడియోను వైర‌ల్ చేస్తున్నారు. 


logo