మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 19, 2020 , 16:59:56

మహిళల మూత్రంతో బ్రెడ్‌ తయారీ..!

మహిళల మూత్రంతో బ్రెడ్‌ తయారీ..!

పారిస్‌: బ్రెడ్‌ తయారీకి మహిళల మూత్రానికి సంబంధం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును ఇది నిజమే.  ఫ్రాన్స్‌లోని ఓ బేకరీ యజమాని తమ స్వంత ఉత్పత్తులైన ‘గోల్డిలాక్స్‌ బ్రెడ్‌’ తయారీ కోసం పబ్లిక్‌ టాయిలెట్స్‌ నుంచి మహిళల మూత్రం సేకరిస్తున్నదట.  తనను తాను 'ఎకో-ఫెమినిస్ట్'గా చెప్పుకునే ఈ లూయిస్‌ రాగెట్‌ అనే మహిళా వ్యాపారి సేకరించిన మహిళల మూత్రాన్ని బ్రెడ్‌ తయారీకి ఉపయోగించే గోధుమలను ఫెర్టిలైజ్‌ చేసేందుకు వాడుతున్నదట. మూత్రం మంచి ఎరువు అని ఆమె పేర్కొంటోంది. స్థిరమైన ఆహార చక్రం సృష్టించడమే తన లక్ష్యమని చెబుతోంది లూయిస్‌.  

ఆమె బేకింగ్ ప్రక్రియ చాలా క్లిష్టంగా లేదు. ఆమె మొదట వుమెన్స్‌ రెస్ట్‌ రూంల నుంచి మూత్రాన్ని సేకరించి గోధుమలపై పిచికారీ చేస్తుంది. ‘ఇది నిర్లక్ష్యం చేయబడిన ద్రవం.. సాధారణంగా ఇది వ్యర్థంగా పరిగణించబడుతుంది. కానీ, దీనిని బంగారు గనిగా చూడాలి’ అని అంటోంది రాగెట్‌. ఇందులో నత్రజని, పొటాషియంతోపాటు అనేక ఇతర పోషకాలుంటాయని చెబుతోంది. మూత్రం అనేది వృథాగా భూమిలో కలిసిపోతున్నదని, అందులోని పోషకాలను తిరిగి పొందలేకపోతున్నామని పేర్కొంది. అందుకే రసాయన ఎరువులను వాడాల్సి వస్తున్నదని అంటోంది. యూరిన్‌ను డైరెక్టగా వాడమని, దాన్ని20 సార్లు డైల్యూట్‌ చేసిన తర్వాతే ఎరువుగా ఉపయోగిస్తామని చెప్పింది. తాను ‘ఎకో ఫెమినిజం’ నమ్మకాలు కలిగి ఉన్నందునే కేవలం మహిళల మూత్రం సేకరిస్తున్నట్లు వివరించింది. logo