గురువారం 01 అక్టోబర్ 2020
International - Aug 01, 2020 , 01:19:53

10 కోట్ల ఏండ్ల తర్వాత బ్యాక్టీరియా పునరుజ్జీవం

10 కోట్ల ఏండ్ల తర్వాత బ్యాక్టీరియా పునరుజ్జీవం

జీవం ఉనికికి సంబంధించి కొత్త కోణం 

  • లండన్‌: సముద్ర అడుగుల్లోని అవక్షేపాల్లో 10 కోట్ల ఏండ్ల క్రితం నిక్షిప్తమైన బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు ఇప్పుడు మళ్లీ ప్రయోగశాలలో పునరుజ్జీవింపజేశారు. జీవం ఉనికికి సంబంధించిన కొత్త కోణాలను ఈ పరిశోధన తెలియజేస్తుందని భావిస్తున్నారు. అమెరికా, జపాన్‌ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఆస్ట్రేలియా తూర్పుతీరప్రాంతంలోని సముద్రజలాల్లో ఈ అవక్షేపాలను గతంలోనే సేకరించి వాటిలో ఏమైనా సూక్ష్మజీవులున్నాయా అన్నదానిపై పరిశోధనలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో వాటిలో దాదాపు నిర్జీవస్థితిలో ఉన్న పదిరకాల జాతుల బ్యాక్టీరియాను వారు గుర్తించారు. వాటికి నైట్రోజన్‌, కార్బన్‌ వంటి ‘ఆహారాన్ని’ అందించటంతో అవి క్రమంగా మళ్లీ పునరుజ్జీవించాయి. 


logo