శుక్రవారం 05 జూన్ 2020
International - May 12, 2020 , 19:04:51

హాస్పిట‌ల్‌ మెట‌ర్నిటీ వార్డుపై దాడి.. చిన్నారులు మృతి

హాస్పిట‌ల్‌ మెట‌ర్నిటీ వార్డుపై దాడి.. చిన్నారులు మృతి

హైద‌రాబాద్‌: ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఇవాళ రెండు పేలుళ్ల సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. రాజ‌ధాని కాబూల్‌లో ఓ హాస్పిట‌ల్‌పై జ‌రిగిన దాడిలో 15 మంది చ‌నిపోయారు. ఈ దాడిలో ఇద్ద‌రు పసిపాప‌ల‌తో పాటు మ‌రో 11 మంది త‌ల్లులు, న‌ర్సులు మృతిచెందారు. ఇదే దాడిలో 15 మంది గాయ‌ప‌డ్డారు. వారిలో అనేక మంది చిన్నారులు ఉన్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం దుండ‌గులు ఆయుధాల‌తో హాస్పిట‌ల్‌పై దాడికి దిగారు. మెడిసిన్స్ శాన్స్ ఫ్రాంటైర్స్ హాస్పిట‌ల్ లో ఈ దాడి జ‌రిగింది. దీంట్లో కొంద‌రు విదేశీయులు కూడా ప‌నిచేస్తుంటారు.  మ‌రో చోట పోలీసు అంత్య‌క్రియ‌ల‌ను టార్గెట్ చేస్తూ కూడా దాడికి పాల్ప‌డ్డారు. ఆ ఘ‌ట‌న‌లో 24 మంది చ‌నిపోయారు.  బాంబు పేలుడులో డ‌జ‌న్ల సంఖ్య‌లో జ‌నం గాయ‌ప‌డ్డారు.  రెండు ఘ‌ట‌న‌ల్లోనూ మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉన్న‌ది. హాస్పిట‌ల్‌ఫై జ‌రిగిన దాడి ఘ‌ట‌న‌లో సుమారు వంద మంది మ‌హిళ‌ల‌ను, చిన్నారుల‌ను పోలీసులు ర‌క్షించారు. దాడికి పాల్ప‌డిన దుండ‌గులు పోలీసు దుస్తుల్లో వ‌చ్చిన‌ట్లు స‌మాచారం ఉన్న‌ది. అయితే కొన్ని గంట‌ల పాటు సాగిన ఎదురుకాల్పుల్లో దుండ‌గుల్ని కాల్చి చంపారు. 

.


logo