శనివారం 06 జూన్ 2020
International - May 10, 2020 , 15:06:29

బుర‌ద‌లో మొస‌లి..అవార్డు విన్నింగ్ ఫొటో

బుర‌ద‌లో మొస‌లి..అవార్డు విన్నింగ్ ఫొటో

సాధార‌ణంగా ఫొటోగ్రాఫర్లు ప్ర‌కృతిలోని ఎన్నో ర‌కాల సౌంద‌ర్యాల‌ను త‌మ కెమెరాల్లో బంధిస్తుంటారు. కొన్ని సార్లు తీసే ఫొటోలు మాత్రం చాలా ప్ర‌త్యేకంగా ఉంటాయి. అలాంటి ఫొటోలు కూడా అరుదుగా కెమెరా కంటికి చిక్కుతుంటాయి. అలాంటిదే ఈ స్టిల్‌. ఓ మొస‌లి బుర‌ద‌ లో నుంచి త‌న తల‌ను పైకి లేపుతున్న‌పుడు జెన్స్ క‌ల్మ‌ణ్ ఫొటో తీశారు.

మొస‌లి త‌ల‌, బుర‌ద‌లో క‌లిసిపోగా..ప‌సుపు రంగులో మెరుస్తున్న మొస‌లి క‌న్ను ఒక‌టి చూడ‌టానికి కాస్త భ‌యంక‌రంగా క‌నిపిస్తోంది. ఇలాంటి ఫొటో క‌నిపించ‌డం చాలా అరుదనే చెప్పాలి. ఈ స్టిల్ జ‌ర్మ‌నీ సొసైటీ నిర్వ‌హించిన నేచ‌ర్ ఫొటోగ్ర‌ఫీ కాంటెస్ట్ లో అవార్డు గెలుచుకుంది.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo