ఆదివారం 31 మే 2020
International - May 15, 2020 , 18:21:35

భారతీయ చెఫ్‌ భార్య.. ఆస్ట్రియన్‌ యువరాణి మృతి...

భారతీయ చెఫ్‌ భార్య.. ఆస్ట్రియన్‌ యువరాణి మృతి...

ఆస్ట్రియా దేశ యువరాణి మారియా పెట్రోవ్నా గిలిట్జిన్‌ హృదయ సంబంద సమస్యతో మృతి చెందింది. రాజ వంశపు అమ్మాయి అయినప్పటికీ ఆ దేశంలో ఉద్యోగానికి వెళ్ళిన సాదారణ భారతీయ చెఫ్‌ రిషి రూప్‌ సింగ్‌ను 2017 లో ప్రేమ వివాహం చేసుకుంది గిలిట్జిన్‌. తమ ప్రేమను రాజ కుటుంబంలో కూడా ఒప్పించి పెండ్లి చేసుకుని ఎంతో ఆనందంగా జీవిస్తున్న ఈ జంట ప్రేమ చివరికి విషాదంగా మారింది. ఈ సంఘటన ఆ దేశ ప్రజలందరినీ తీవ్రంగా కలచివేసింది. మే 11 కే ఆమెకు 32 సంవత్సరాల వయసు వచ్చింది. ఆమెకు రెండు సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు.logo