శుక్రవారం 04 డిసెంబర్ 2020
International - Nov 01, 2020 , 02:00:02

మళ్లీ లాక్‌డౌన్‌ బాటలో ఆస్ట్రియా, బ్రిటన్‌

మళ్లీ లాక్‌డౌన్‌ బాటలో ఆస్ట్రియా, బ్రిటన్‌

వియన్నా: కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఆస్ట్రియాలో నాలుగు వారాలపాటు పాక్షిక లాక్‌డౌన్‌ ప్రకటించారు. రాత్రి 8 గంటల తర్వాత ప్రజలు ఇండ్లు వదిలి బయటకు రావద్దని శనివారం ఆదేశాలు జారీచేశారు. బార్లు, రెస్టారెంట్లు, సాంస్కృతిక, క్రీడా స్థలాలు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు కరోనా వైరస్‌ రెండో దశలో భారీగా వ్యాపిస్తుండటంతో బ్రిటన్‌ ప్రభుత్వం కూడా మళ్లీ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించాలని యోచిస్తున్నది.