క్యాన్బెరా: ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ ఎయిర్లైన్స్ వ్యాక్సినేషన్ మార్గదర్శకాలను జారీ చేసింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులు కచ్చితంగా కోవిడ్ టీకా తీసుకోవాలని ఆదేశించింది. ఉద్యోగులు కోవిడ్ టీకా తీసుకోవాలని ఆదేశించిన తొలి అంతర్జాతీయ విమానయాన సంస్థ ఇదే కావడం విశేషం. ఫ్రంట్లైన్ వర్కర్లు అయిన పైలెట్లు, క్యాబిన్ సిబ్బంది, విమానాశ్రయ సిబ్బంది.. నవంబర్ లోగా పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వేయించుకోవాలని క్వాంటాస్ సంస్థ ఆదేశించింది. ఇక సంస్థకు చెందిన మిగితా సిబ్బంది వచ్చే ఏడాది మార్చి వరకు రెండు డోసుల టీకాలు తీసుకోవాలని సూచించింది.