సోమవారం 01 జూన్ 2020
International - May 02, 2020 , 14:00:22

ఆస్ట్రేలియా ఆర్థిక ప్యాకేజీ ప్రపంచానికే ఆదర్శం : కాసర్ల నాగేందర్‌రెడ్డి

ఆస్ట్రేలియా ఆర్థిక ప్యాకేజీ ప్రపంచానికే ఆదర్శం : కాసర్ల నాగేందర్‌రెడ్డి

సిడ్ని : కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ ప్రపంచానికే ఆదర్శమని టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌ రెడ్డి అన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను చుట్టిముట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోని ఏడు రాష్ర్టాలు ఈ వైరస్‌ భారిన పడ్డాయి. మొత్తం 6,767 మంది కోవిడ్‌-19 భారిన పడగా వీరిలో 93 మంది మృతిచెందారు. 5,745 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. కాగా ఈ విపత్తు వల్ల ఏర్పడ్డ ఆర్థికమాంద్యం వల్ల ఎవరూ ఇబ్బందులు పడకుండా వచ్చే ఆరు నెలలకిగాను 350 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిధులతో వ్యాపారస్తులు, ఉద్యోగులు, వృద్ధులు, పెన్షనర్లను ఆదుకోవడంతో పాటు విదేశీ విద్యార్థులకు కూడా ఆర్థిక సహాయం అందించనుంది. 

కోవిద్‌ సేఫ్‌ యాప్‌..

కరోనా విపత్తు నుంచి బయటపడేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కోవిద్‌ సేఫ్‌ యాప్‌ని ప్రవేశపెట్టింది. ఈ యాప్‌ ద్వారా మనం వెళ్లిన ప్రదేశాల్లో ఎవరైనా కరోనా పాజిటివ్‌ వ్యక్తులు ఉన్నా, మనం వెళ్లి వచ్చిన తర్వాత పాజిటివ్‌గా తేలినా ఈ యాప్‌ ద్వారా ట్రాక్‌ చేసి సమాచారాన్ని అందించి పరీక్షలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ యాప్‌ విస్తృత వినియోగంతో అతి త్వరలోనే కరోనాను జయించవచ్చనే నమ్మకాన్ని కల్పిస్తున్నారు.


logo