శనివారం 16 జనవరి 2021
International - Dec 01, 2020 , 10:35:19

ల‌క్ష‌ల సంఖ్యలో న‌క్ష‌త్రాల‌తో కొత్త మ్యాప్‌..

ల‌క్ష‌ల సంఖ్యలో న‌క్ష‌త్రాల‌తో కొత్త మ్యాప్‌..

హైద‌రాబాద్‌: న‌క్ష‌త్రాలు, పాల‌పుంత‌ల‌కు చెందిన కొత్త మ్యాప్‌ను ఆస్ట్రేలియా శాస్త్ర‌వేత్త‌లు రిలీజ్ చేశారు.  ఆ దేశంలోని ఓ ఎడారిలో ఉన్న ఆధునిక టెలిస్కోప్‌తో ఆ న‌క్ష‌త్ర స‌మూహాల‌ను గుర్తించారు.  ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉన్న గెలాక్సీల‌ను మ్యాపింగ్ చేసిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు.  జాతీయ సైన్స్ ఏజెన్సీ సీఎస్ఐఆర్‌వోకు చెందిన కొత్త టెలిస్కోప్ ఆ పాల‌పుంత‌ల‌ను ప‌సిక‌ట్టింది.  దీంతో ఈ విశ్వానికి చెందిన కొత్త అట్లాస్‌ను రూపొందించిన‌ట్లు ఆ సంస్థ చెప్పింది.  రికార్డు స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న సాధించిన‌ట్లు వెల్ల‌డించింది.  న‌క్ష‌త్రాల‌కు సంబంధించిన సంపూర్ణ స‌మాచారాన్ని ఉంచిన‌ట్లు ఆ సంస్థ పేర్కొన్న‌ది.  సుమారు 30 ల‌క్ష‌ల గెలాక్సీల‌ను మ్యాపింగ్ చేసిన‌ట్లు సీఎస్ఐఆర్‌వో తెలియ‌జేసింది. ఫోటోల‌తో స‌హా ఆ వివ‌రాల‌ను స‌ర్వేలో వెల్ల‌డించారు.  అయితే తాము మ్యాప్ చేసిన ఫోటోలు.. ఈ విశ్వం గురించి కొత్త ఆవిష్క‌ర‌ణ‌లను బ‌య‌ట‌పెట్టే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  కేవ‌లం 300 గంట‌ల్లోనే న‌క్ష‌త్రాల మ్యాపింగ్ ప్ర‌క్రియ జ‌రిగిన‌ట్లు సీఎస్ఐఆర్‌వో తెలియ‌జేసింది.  గ‌తంలో ఈ ప్ర‌క్రియ‌కు ఏళ్లు ప‌ట్టేద‌న్నారు. చుక్క‌లు, న‌క్ష‌త్రాలు ఎలా ఏర్ప‌డ్డాయి, అవి ఎలా మ‌హా కృష్ణ బిల్హాలుగా ఏర్ప‌డ్డాయో అధ్య‌య‌నంలో తెలుస్తుంద‌ని డేవిడ్ మెక్‌కాన‌ల్ తెలిపారు. తాజా రిపోర్ట్‌ను ఆస్ట్రానామిక‌ల్ సొసైటీ ఆఫ్ ఆస్ట్రేలియాలో ప్ర‌చురించారు.