సిడ్నీ : ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ క్యాజల్లో బయాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న మైకెల్ మహోనీకి జంతుప్రేమ కొంచం ఎక్కువ. ఆ మక్కువే ప్రకృతి, జీవజాలంతో మమేకమయ్యేలా చేసింది. ఎంతలా అంటే.. కప్పలు చేసే ఒకరకమైన శబ్దాలను ఆయన అర్థం చేసుకోగలరు. ఆయన చేసే శబ్దాలకు కప్పలూ ప్రతిస్పందించగలవు. విద్యార్థి దశ నుంచే కప్పలపై చేసిన అధ్యయనం మూలంగా ఆ జీవులు చేసే శబ్దాలను తాను అర్థంచేసుకోవడంతో పాటు అనుకరించగలనని ఆయన చెప్తున్నారు.