శుక్రవారం 05 జూన్ 2020
International - May 01, 2020 , 15:03:51

మాల్‌లో కత్తితో దాడి.. ఉన్మాది కాల్చివేత‌

మాల్‌లో కత్తితో దాడి.. ఉన్మాది కాల్చివేత‌


హైద‌రాబాద్‌: ప‌శ్చిమ ఆస్ట్రేలియాలోని షాపింగ్ సెంట‌ర్‌లో ఓ ఉన్మాది క‌త్తితో దాడికి దిగాడు. ఆ దాడిలో సుమారు అయిదు మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.  అయితే అక్క‌డే ఉన్న పోలీసులు ఆ దుండ‌గుడిని కాల్చి చంపారు. ఈ  ఘ‌ట‌న పిల్‌బారా ప్రాంతంలోని సౌత్ హెడ్‌ల్యాండ్ స్క్వేర్ సెంట‌ర్‌లో జ‌రిగింది.  ఓ భారీ క‌త్తితో ఉన్మాది షాపింగ్ మాల్‌లో బీభ‌త్సం సృష్టించిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు.  ఆ దుండ‌గుడిని ఆపేందుకు మొద‌ట పోలీసులు ప్ర‌య‌త్నించారు. అయినా వారిపైన కూడా అత‌ను దాడి చేసే ప్ర‌యత్నం చేశారు. దీంతో అత‌న్ని కాల్చివేశారు. అయితే ఈ ఘ‌ట‌న వెనుక ఉగ్ర‌వాదం కోణం ఉన్న‌ట్లు పోలీసులు నిర్ధారించ‌లేదు. మైనింగ్ ఉద్యోగ‌స్తులు ఎక్కువ‌గా ఉండే ప్రాంతంలో ఈ దాడి జ‌రిగింది.  ఘ‌ట‌న‌కు సంబంధించిన విచార‌ణ కొన‌సాగిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.logo