శనివారం 06 జూన్ 2020
International - Apr 15, 2020 , 14:04:36

క్వారెంటైన్‌లో ఉంటూ గ‌ర్ల్‌ఫ్రెండ్ ద‌గ్గ‌ర‌కి వెళ్లిన వ్య‌క్తికి జైలుశిక్ష‌

క్వారెంటైన్‌లో ఉంటూ గ‌ర్ల్‌ఫ్రెండ్ ద‌గ్గ‌ర‌కి వెళ్లిన వ్య‌క్తికి జైలుశిక్ష‌

హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియాలో క్వారెంటైన్‌లో ఉన్న ఓ వ్య‌క్తి ప‌దేప‌దే త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను క‌లిసేందుకు వెళ్లాడు. ఆ కేసులో అత‌నికి ఇవాళ కోర్టు శిక్ష విధించింది.  రెండు వేల డాల‌ర్ల జ‌రిమానా కూడా విధించింది. ఆరు నెల‌ల రెండు వారాల పాటు జైలు శిక్ష విధించారు. క‌నీసం నెల రోజులైనా ఆ వ్య‌క్తి క‌ట‌క‌టాల్లో ఉండాల్సిందే అని  పెర్త్ కోర్టు ఆదేశించింది. పెర్త్‌కు చెందిన డేవిడ్ అనే వ్య‌క్తిని.. కొన్ని రోజుల క్రితం క్వారెంటైన్ చేశారు. ట్రావెల్‌లాడ్జ్ హోటల్‌లో అత‌ను 14 రోజుల పాటు క్వారెంటైన్ కావాల్సి ఉన్న‌ది. కానీ అత‌ను హోట‌ల్ నుంచి బ‌య‌ట‌కు దూకి త‌న ప్రేయ‌సిని కలిసేందుకు వెళ్లేవాడు.  డేవిడ్ హోట‌ల్ నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌డాన్ని ప‌లుమార్లు చూసిన అక్కడి సిబ్బంది అత‌నిపై కేసు వేశారు.  దీంతో పెర్త్ మెజిస్ట్రేట్ ఆ కేసులో డేవిడ్‌కు శిక్ష ఖ‌రారు చేశారు. logo