శనివారం 06 జూన్ 2020
International - Apr 22, 2020 , 19:43:16

డ్రోన్‌తో చేపలకు గాలం

డ్రోన్‌తో చేపలకు గాలం

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుందంటే ఇదేనేమో... లాక్‌డౌన్‌లో ప్ర‌పంచవ్యాప్తంగా ప‌రిస్థితి నిజంగా బ‌యంక‌ర‌మైన‌ది. కాని కొంత‌మంది ఈ స‌మ‌యాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు.  ఆస్ట్రేలియా నివాసి సామ్ రోమియో  వినూత్నంగా ఆలోచించాడు. ఇంటి ముందు బీచ్ ఉంది. ఆందులో చేపలు పట్టాలనేది ఆయన కోరిక. కానీ ఎం చేస్తాం లాక్‌డౌన్‌ కారణంగా బీచ్‌లోకి వెళ్లలేని పరిస్థితి. కానీ అతను అనుకున్న పని చేశాడు. డ్రోన్‌కు వానపామును అతికించి నీటిలోకి దించాడు. 30 నిమిషాలలో ఒక తెల్ల చేప‌ను ప‌ట్టుకోగ‌లిగాడు. చేపలు పట్టడమే కాదు డ్రోన్‌తో గిఫ్ట్‌లు కూడా పంపిస్తున్నాడు. 

లాక్‌డౌన్‌లో ఇటీవ‌ల త‌న ప్రెండ్ వివాహం జ‌రుగింది. వారికి గిఫ్ట్‌గా ఉంగ‌రం ఇవ్వాల‌నుకున్నాడు. లాక్‌డౌన్‌లో వెళ్ల‌లేని ప‌రిస్థితి క‌దా. అందుకే  టెడ్డీబేర్‌లో ఒక ఉంగ‌రం అటాచ్ చేసి డ్రోన్‌తో పంపించాడు. స‌మ‌యానికి బ‌హుమ‌తి డెలివ‌రీ అయింది. డ్రోన్ ఉప‌యోగించి నిర్వ‌ర్తిచ్చించిన రెండు ప‌నుల వీడియోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు రోమియో.logo