శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Aug 12, 2020 , 15:21:30

అధికారిని ఎదిరించినందుకు ఉద్యోగంతోపాటు కోటిరూపాయ‌లు గెలుచుకున్నాడు!

అధికారిని ఎదిరించినందుకు ఉద్యోగంతోపాటు కోటిరూపాయ‌లు గెలుచుకున్నాడు!

ఒక మీమ్ త‌న జీవితాన్నే మార్చేసింది. ఉన్న ఉద్యోగాన్ని ఊడేలా చేసింది. బ‌దులుగా కోటి రూపాయ‌‌ల‌తో పాటు మ‌ర‌లా అదే ఉద్యోగంలో చేరేలా చేసింది. ఇంత‌కీ ఆ మీమ్ ఏంటి? ఏం జ‌రిగిందంటే.. ఆస్ట్రేలియాకు చెందిన స్కాట్ ట్రేసీ అనే వ్య‌క్తి బీపీ అనే పెట్రోలియం సంస్థ‌లో ప‌నిచేసేవాడు. జ‌న‌వ‌రిలో స్కాట్ త‌న స్నేహితుల‌తో క‌లిసి అడాల్ఫ్ హిట్ల‌ర్ అనే మీమ్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఎప్ప‌టి నుంచో వీరి జీతాలు పెర‌గ‌కుండా అడ్డుకునే అధికారికి సంబంధించిన‌ట్లుగా ఈ మీమ్‌ను త‌యారు చేశాడు. స్కాట్‌కు గిట్ట‌నివాళ్లు ఈ విష‌యాన్ని అధికారికి చూపించారు. దీంతో ఆయ‌న‌కు మండి స్కాట్‌ను ఉద్యోగంలోంచి తీసేశాడు. అందుకు స్కాట్ బాధ‌ప‌డుతూ ఇంటికి వెళ్ల‌కుండా ఫెయిర్ వ‌ర్క్ క‌మిష‌న్‌ను (ఎఫ్‌డబ్ల్యూసీ)ను ఆశ్రయించాడు. 

ఇది స్కాట్‌కు మ‌ద్ధ‌తు ప‌లుకుతూ విచార‌ణ చేప‌ట్టింది. త‌ప్పులేక‌పోయినా ఉద్యోగంలో తీసేయ‌డంతో స్కాట్ ఆర్థికంగా ఇబ్బంది ప‌డ్డాడు. దీనికి 1.43 ల‌క్ష‌ల డాల‌ర్లు ప‌రిహారం అందిస్తున్న‌ట్లు పేర్కొన్న‌ది. అంత‌టితో ఆగ‌కుండా బీపీ సంస్థ మ‌ర‌లా స్కాట్‌ను విధుల్లోకి తీసుకోవాల‌ని ఆదేశించింది. దీనికి వ్య‌తిరేఖంగా బీపీ సంస్థ స‌వాల్ చేస్తూ ఫెడ‌ర‌ల్ కోర్టుకు వెళ్లింది. అక్క‌డ కూడా చేదు అనుభ‌వం ఎదురైంది. ఎన్ని చేసినా స్కాట్‌కు అనుకూలంగానే జ‌రిగింది. త్వ‌ర‌లోనే స్కాట్ బీపీ సంస్థ‌లో చేర‌తాడ‌ని చెప్పుకొచ్చింది. 


logo