శనివారం 06 జూన్ 2020
International - Apr 09, 2020 , 09:33:03

క‌రోనా వివాదం.. క్రూయిజ్ షిప్ బ్లాక్‌బాక్స్ స్వాధీనం

క‌రోనా వివాదం.. క్రూయిజ్ షిప్ బ్లాక్‌బాక్స్ స్వాధీనం

హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో రూబీ ప్రిన్సెస్ నౌక‌ను మార్చి 19వ తేదీన డాకింగ్ చేశారు.  క‌రోనా పాజిటివ్ పేషెంట్లు ఉన్న ఆ షిప్‌ను ఎలా డాకింగ్ చేశార‌ని ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న‌ది.  ఆ నౌక నుంచి ప్ర‌యాణికుల‌ను ఎందుకు బ‌య‌ట‌కు పంపించార‌న్న కోణంలో ఆసీస్ పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.  అయితే ఆ షిప్‌లో ఉన్న 15 మంది క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు.  విమానాల్లో ఉండే బ్లాక్‌బాక్స్ త‌ర‌హాలోనే నౌక‌ల్లోనూ బ్లాక్‌బాక్స్ ఉంటుంది.  దాన్ని ఆస్ట్రేలియా పోలీసులు సీజ్ చేశారు. ఆస్ట్రేలియాలో ప్ర‌స్తుతం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌ 600కు చేరుకున్న‌ది.  అయితే దేశంలో న‌మోదు అవుతున్న‌ ఇన్‌ఫెక్ష‌న్ల‌కు రూబీ ప్రిన్స్ క్రూయిజ్ షిప్ కార‌ణ‌మ‌ని పోలీసులు భావిస్తున్నారు. బ్లాక్‌బాక్స్‌తో పాటు ఇత‌ర ఆధారాల‌ను సేక‌రిస్తున్న‌ట్లు న్యూసౌత్ వెల్స్ పోలీసులు చెప్పారు.  ఆ షిప్‌లో సుమారు వెయ్యి మంది సిబ్బంది ఉన్న‌ట్లు భావిస్తున్నారు.  వారిలో దాదాపు 200 మంది ఫ్లూ లాంటి ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్నారు. వైర‌స్ ప‌రీక్ష‌లో 18 మంది పాజిటివ్‌గా తేలారు. logo