బుధవారం 03 జూన్ 2020
International - May 08, 2020 , 12:26:05

తెరచుకోనున్న రెస్టారెంట్లు, కేఫ్‌లు

తెరచుకోనున్న రెస్టారెంట్లు, కేఫ్‌లు

కాన్‌బెర్రా: కరోనా వైరస్‌ ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టడానికి తొలుత రెస్టారెంట్లు, కేఫ్‌లను తెరవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా తగ్గుతుండటంతో మూడు దశల్లో ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించాని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తప్పనిసరిగా మాస్కులు కట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం, పరిమిత సామర్థ్యం వంటి షరతులతో కేఫ్‌లు, రెస్టారెంట్లు తెరచుకోవచ్చని ఆస్ట్రేయా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ ప్రకటించారు. 

గత 30 ఏండ్ల నుంచి స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తున్న ఆస్ట్రేలియా, కరోనా మహమ్మారి దెబ్బతో కుదేలయ్యింది. దేశంలో ఇప్పటివరకు 6900 మంది కరోనా బారిన పడగా, 97 మంది బాధితులు మరణించారు. దేశంలోని న్యూ సౌత్‌వెల్స్‌, విక్టోరియా రాష్ర్టాల్లో కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్నది. గురువారం దేశవ్యాప్తంగా 22 కేసులు మాత్రమే నమోదవగా, వైరస్‌ బారిన పడినవారు క్రమంగా కోలుకుని డిశ్చార్జి అవుతున్న వారు కూడా ఎక్కువగానే ఉంటున్నారు. 


logo