ఆదివారం 05 జూలై 2020
International - Jun 01, 2020 , 01:27:19

మారిసన్‌.. మోదీ.. సమోసా

మారిసన్‌.. మోదీ.. సమోసా

లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌.. భారతీయులు ఎంతో ఇష్టంగా ఆరగించే సమోసాలు, మామిడి పచ్చడిని తయారుచేసి ఆ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ‘వీటిని ప్రధాని మోదీతో పంచుకోవాలనుకున్నా’ అని తెలిపారు. మారిసన్‌ ట్వీట్‌కు ప్రధాని మోదీ స్పందిస్తూ.. ‘సమోసాలు అద్భుతంగా ఉన్నాయి. కరోనాపై విజయం సాధించాక, ఇద్దరం కలిసి సమోసాలను ఆస్వాదిద్దాం’ అని మళ్లీ ట్వీట్‌ చేశారు


logo