శనివారం 06 జూన్ 2020
International - May 08, 2020 , 10:04:59

మూడు ద‌శ‌ల్లో తెరుచుకోనున్న ఆస్ట్రేలియా..

మూడు ద‌శ‌ల్లో తెరుచుకోనున్న ఆస్ట్రేలియా..

హైద‌రాబాద్‌: లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ప్ర‌పంచ‌దేశాలు స‌డ‌లిస్తున్నాయి. మూడు ద‌శ‌ల్లో లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను ఎత్తివేయ‌నున్న‌ట్లు ఆస్ట్రేలియా ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్ తెలిపారు. ఈ శుక్ర‌వారం నుంచే ఆ ప్ర‌ణాళిక మొద‌ల‌వుతుంద‌న్నారు.  తొలి ద‌శ‌లో ఇంటికి వ‌చ్చేందుకు అయిదు మంది అతిథుల‌కు అవ‌కాశం క‌ల్పించారు.  బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ప‌ది మంది గుమ్మికూడేందుకు అనుమ‌తిచ్చారు. రెస్టారెంట్లు, కేఫ్‌లు, రిటేల్ షాపుల‌ను తెరుస్తున్నారు. కావాలంటే వ‌ర్క్ ఫ్ర‌మ్ కొన‌సాగించ‌వ‌చ్చు. క్లాస్ రూమ్‌లు, ప్లే గ్రౌండ్స్‌ను ఓపెన్ చేస్తున్నారు. దేశీయ ప్ర‌యాణాల‌కు కూడా ప‌చ్చ‌జెండా ఊపారు.  

ఇక రెండ‌వ ద‌శ‌లో కొన్నిటింకి అనుమ‌తి ఇచ్చారు.  రెండ‌వ ద‌శ‌లో 20 మంది వ‌ర‌కు స‌మావేశం అయ్యేందుకు ఓకే చెప్పేశారు. సినిమాలు, జిమ్‌లు, బ్యూటీ సెలూన్లు, క్రీడా ఈవెంట్ల‌కు అనుమ‌తి ఇస్తారు.   ఇక మూడ‌వ ద‌శ‌లో ఎక్క‌డైనా వంద మంది స‌మావేశం అయ్యేందుకు అనుమ‌తి ఉంటుంది. అయితే నిబంధ‌న‌ల‌ను ఆయా రాష్ట్రాలు త‌మ‌కు అనుగుణంగా అమ‌లు చేసే అవ‌కాశం క‌ల్పించారు. కానీ సోష‌ల్ డిస్టాన్సింగ్ త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి.  క్వీన్స్‌ల్యాండ్‌, ఉత్త‌ర రాష్ట్రాలు ఇప్ప‌టికే ఈ నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేస్తున్నాయి. 

మ‌హ‌మ్మారులు వ‌స్తుంటాయని, కేసులు ఎక్కువ సంఖ్య‌లోనే న‌మోదు అవుతాయ‌ని, మ‌నం అనుకున్న‌ట్లుగా ఏదీ జ‌ర‌గ‌దు అని ప్ర‌ధాని మారిస‌న్ అన్నారు. ప్రాన భ‌యంతో మ‌నం ముందుకు వెళ్ల‌కుండా ఆగ‌లేమ‌న్నారు.  వ్యాపారాల‌ను తెరువాల్సిన సంద‌ర్భం వ‌చ్చింద‌న్నారు. logo