గురువారం 28 మే 2020
International - Apr 21, 2020 , 15:10:33

డ‌బ్ల్యూహెచ్‌వో వాహ‌నంపై దాడి.. డ్రైవ‌ర్ మృతి

డ‌బ్ల్యూహెచ్‌వో వాహ‌నంపై దాడి.. డ్రైవ‌ర్ మృతి

హైద‌రాబాద్‌: ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు చెందిన వాహ‌నంపై దాడి జ‌రిగింది. మ‌య‌న్మార్‌లోని రాకైన్ రాష్ట్రంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.  క‌రోనా పేషెంట్ల‌కు చెందిన శ్యాంపిళ్ల‌ను తీసుకున్న వాహ‌నంపై దుండ‌గులు దాడి చేశారు. ఈ దాడిలో కారు డ్రైవ‌ర్ అక్క‌డిక్క‌డే మృతిచెందాడు. మ‌య‌న్మార్‌లో ఉన్న యూఎన్ ఆఫీసు త‌న ఫేస్‌బుక్ పేజీలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. అయితే డ‌బ్ల్యూహెచ్‌వో వాహ‌నంపై ఎవ‌రు దాడి చేశార‌న్న విష‌యం ఇంకా తెలియ‌రాలేదు. 


logo