మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Aug 22, 2020 , 15:39:14

క్వారెంటైన్ పాట‌.. చూడ్డానికి రెండు క‌ళ్లూ చాల‌వు!

క్వారెంటైన్ పాట‌.. చూడ్డానికి రెండు క‌ళ్లూ చాల‌వు!

క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా ప్ర‌పంచ‌మంతా లాక్‌డౌన్ విధించారు. రోజులు గ‌డుస్తున్నా ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇంకెన్నాళ్లు అని లాక్‌డౌన్ కూడా ఎత్తేశారు. కేసులు ఎక్కువ‌గా ఉన్న ఏరియాల్లో రెడ్‌జోన్‌గా ప్ర‌క‌టిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అంద‌రూ ఇంటిప‌ట్టునే ఉండాల్సి వ‌స్తుంది. ఇంట్లో ఉండి బోర్ కొడుతుండ‌డంతో ఇంటి ప‌నులు, వంట ప‌నులు నేర్చుకుంటూ టైంపాస్ చేస్తున్నారు ప్ర‌తి ఒక్క‌రూ. అయినా బోర్ కొడుతుండ‌టంతో పాట‌లు పాడుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ గ‌డిపేస్తున్నారు.

అలా దిగ్బంధంలో ఉన్న ఓ మ‌హిళ ఏసుప్ర‌భూకి సంబంధించిన పాట పాడి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. కెడి ఫ్రెంచ్ అనే మ‌హిళ అట్లాంటాలో నివ‌సిస్తున్న‌ది. సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ పాట వైర‌ల్‌గా మారింది. ఇది ఒక‌టి మాత్ర‌మే కాదు ఆమె ఫేస్‌బుక్ పేజీలో యేసు పేరును ప్ర‌శంసిస్తూ చాలా పాట‌లు పోస్ట్ చేసింది. 'ఎట్ ది ఫ్రిజ్ ఎగైన్' పాటకు ఫేస్‌బుక్‌లో సుమారు 7 మిలియన్ల వీక్షణలను సంపాదించింది.  


logo