మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 30, 2020 , 06:50:23

చమురు లీకేజీ.. 40 డాల్ఫిన్లు మృతి

చమురు లీకేజీ.. 40 డాల్ఫిన్లు మృతి

పోర్ట్‌ లూయిస్‌ : మారిషస్‌ పరిధిలోని హిందూ మహాసముద్రంలో ఓ జపాన్‌ నౌక నుంచి చమురు భారీఎత్తున లీక్‌ కావటంతో.. ఆ ప్రాంతంలోని సముద్రజలాలు కలుషితమై 40 డాల్ఫిన్లు ప్రాణాలు కోల్పోయాయి. తమ కళ్ల ముందే ఒక డాల్ఫిన్‌ గిలగిలా కొట్టుకుని చనిపోయిందని, ఈ దృశ్యం తమ గుండెల్ని పిండేసిందని ఒక వ్యక్తి తెలిపారు. అంతకుముందు చనిపోయిన తన పిల్ల డాల్ఫిన్‌ చుట్టూ ఆ తల్లి డాల్ఫిన్‌ తిరిగిందని, ఆ తర్వాత ఐదు నిమిషాలకు అది కదలడం ఆగిపోయిందన్నారు. మరణించిన డాల్ఫిన్ల మృతదేహాలు తీరానికి కొట్టుకొస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo