శనివారం 30 మే 2020
International - May 21, 2020 , 11:20:38

అమెరికా మాల్‌లో కాల్పుల ఘ‌ట‌న‌

అమెరికా మాల్‌లో కాల్పుల ఘ‌ట‌న‌

హైద‌రాబాద్‌: అమెరికాలో కాల్పుల ఘ‌ట‌న జ‌రిగింది. ఆరిజోనాలోని ఓ మాల్‌లో దుండ‌గుడు గ‌న్‌తో బీభ‌త్సం సృష్టించాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు గాయ‌ప‌డ్డారు. ఏఆర్‌-15 త‌ర‌హా రైఫిల్‌తో సాయుధుడు ఫైరింగ్‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌ర్ని అదుపులోకి తీసుకున్నారు. గ్లెండేల్ వెస్ట్‌గేట్ ఎంట‌ర్‌టైన్మెంట్ జిల్లాలో ఈ కాల్పుల ఘ‌ట‌న జ‌రిగింది.  సంఘ‌ట‌నా స్థ‌లానికి భారీ సంఖ్య‌లో పోలీసులు చేరుకున్నారు.  ఆర్మాండో జూనియ‌ర్ హెర్నాండేజ్ అనే వ్య‌క్తి కాల్పుల‌కు తెగించాడు. సోష‌ల్ మీడియా ఫైరింగ్‌కు సంబంధించిన వీడియోనూ పోస్టు చేశాడు.  ఓ బాధితురాలిని నేలపై ప‌డేసి.. సాయుధుడు క్రూరంగా ప్ర‌వ‌ర్తించాడు. స‌మాజం ప‌ట్ల తీవ్ర అస‌హ‌నంతో ఉన్న అత‌ను కాల్పుల‌కు తెగించినట్లు తెలుస్తోంది.  


logo