గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Jul 24, 2020 , 13:36:26

ఆఫ్ఘనిస్థాన్‌లో 24 మంది తాలిబ‌న్‌లు హ‌తం

ఆఫ్ఘనిస్థాన్‌లో 24 మంది తాలిబ‌న్‌లు హ‌తం

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబ‌న్ ఉగ్ర‌వాదుల‌కు ఆ దేశ భ‌ద్ర‌తా బ‌ల‌గాలు షాకిచ్చాయి. జ‌బుల్ ప్రావిన్స్‌లోని అర్ఘన్‌దాబ్‌, షింక్జాయ్‌, షా జోయ్ జిల్లాల్లో ఆఫ్ఘనిస్థాన్ సైనికులకు, తాలిబ‌న్‌ల‌కు మ‌ధ్య జ‌రిగిన వేర్వేరు ఎదురు కాల్పుల్లో మొత్తం 24 మంది తాలిబ‌న్‌లు హ‌త‌మ‌య్యారు. మ‌రో మంది తాలిబ‌న్లు గాయ‌ప‌డ్డారు. ఆఫ్ఘనిస్థాన్ ర‌క్ష‌ణ శాఖ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అయితే, ఆఫ్ఘనిస్థాన్ ర‌క్ష‌ణ‌శాఖ ప్ర‌క‌ట‌న‌పై తాలిబ‌న్‌లు ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి స్పంద‌న తెలియ‌జేయ‌లేదు.        

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo