శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Aug 20, 2020 , 18:42:38

ఓడ ధ్వంసమై 17 మంది మృతి

ఓడ ధ్వంసమై 17 మంది మృతి

పోర్ట్-ఔ- ప్రిన్స్ : హైతీ తీరంలో ఓడ ధ్వంసమై కనీసం 17 మంది మరణించినట్లు హైతీ మారిటైమ్ అండ్ నావిగేషన్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ ఎరిక్ ప్రీవోస్ట్ జూనియర్ గురువారం తెలిపారు. అన్సెలిటా అనే ఓడ బుధవారం సెయింట్-లూయిస్ డునార్డ్ కమ్యూన్ నుంచి టోర్టుగా ద్వీపం వైపు బయల్దేరింది. హైతీ తీరం సమీపంలో అకస్మాత్తుగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో  ఇప్పటివరకు 10 మంది మహిళలు, ఇద్దరు పిల్లలతో సహా 17 మంది మృతి చెందారని ప్రీవోస్ట్ మీడియాకు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించారు. పోర్ట్-ఔ- ప్రిన్స్‌కు ఉత్తరాన 100 మైళ్ళు దూరంలోని (160 కిలోమీటర్లు) తీరప్రాంత పట్టణమైన లే బోర్గ్నలో మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. ప్రమాదానికి గల సాంకేతిక కారణాలు ఇంకా గుర్తించలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo