గురువారం 04 జూన్ 2020
International - Apr 25, 2020 , 09:45:54

క‌రోనా వైర‌స్‌.. ఇట‌లీలో 150 మంది డాక్ట‌ర్లు మృతి

క‌రోనా వైర‌స్‌.. ఇట‌లీలో 150 మంది డాక్ట‌ర్లు మృతి

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఇట‌లీలో ఇప్ప‌టివ‌ర‌కు 150 మంది డాక్ట‌ర్లు మృతిచెందారు. ఈ విష‌యాన్ని ఇటాలియ‌న్ అసోసియేష‌న్ ఆఫ్ డాక్ట‌ర్స్ వెల్ల‌డించింది. దేశ‌వ్యాప్తంగా న‌మోదు అయిన వైర‌స్ కేసుల్లో ప‌ది శాతం మంది హెల్త్ కేర్ ప్రొఫెష‌న‌ల్స్ కూడా ఉన్న‌ట్లు ఆ సంఘం పేర్కొన్న‌ది. అయితే తాజాగా అక్క‌డ ప్ర‌భుత్వం .. డాక్ట‌ర్ల ర‌క్ష‌ణ కోసం ఓ కొత్త చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చింది. దీనిపై మ‌రో డాక్ట‌ర్ల సంఘం నిర‌స‌న వ్య‌క్తం చేసింది. వైద్య‌శాఖ‌కు కేటాయించిన 25 బిలియ‌న్ల యూరోలు ఏమాత్రం స‌రిపోవు అని కొంద‌రు డాక్ట‌ర్లు ఆరోపిస్తున్నారు. క‌రోనా వేళ పేషెంట్లు సునామీలా హాస్ప‌టిళ్ల‌కు వ‌చ్చార‌ని, ఇప్ప‌టికే హెల్త్ కేర్ వ్య‌వ‌స్థ‌కు నిధులు స‌రిగా అంద‌డంలేద‌ని వారు విమ‌ర్శించారు.  logo