గురువారం 01 అక్టోబర్ 2020
International - Jul 22, 2020 , 09:28:59

అంత్య‌క్రియ‌ల్లో కాల్పులు.. 14 మందికి గాయాలు

అంత్య‌క్రియ‌ల్లో కాల్పులు.. 14 మందికి గాయాలు

హైద‌రాబాద్‌: అమెరికాలోని చికాగాలో కాల్పుల ఘ‌ట‌న జ‌రిగింది. గ్రీషామ్ ప్రాంతంలో జ‌రిగిన కాల్పుల్లో 14 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కొంద‌రు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించి వెళ్తున్న స‌మ‌యంలో కాల్ప‌లు ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ఈ సంఘ‌ట‌న‌తో సంబంధం ఉన్న ఓ వ్య‌క్తిని క‌స్ట‌డీలో తీసుకున్నారు. వెస్ట్ 79 స్ట్రీట్‌లో అంత్య‌క్రియ‌లు జ‌రుగుతున్న ప్రాంతంలో ఓ న‌ల్ల వాహ‌నంలో వ‌చ్చిన వ్య‌క్తి వారిపై కాల్పులు జ‌రిపాడు. అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రైన వారు కూడా తిరిగి కాల్పులు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. మొత్తం 14 మంది వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్న‌ట్లు చికాగో అధికారులు చెప్పారు. కాల్పుల‌కు దారితీసిన కార‌ణాల గురించి ఇంకా ఎటువంటి స‌మాచారం లేదు. ఓ శ్మ‌శాన‌వాటిక నుంచి కాల్పుల శ‌బ్ధాలు వినిపించిన‌ట్లు స్థానికులు చెప్పారు.  

చెల్లాచెదురుగా శ‌రీరాలు ప‌డి ఉన్నాయ‌ని,  కాళ్ల‌పై, క‌డుపులో, వెన్నులో ఎక్క‌డ ప‌డితే, అక్క‌డ కాల్చేశార‌ని స్థానికులు చెప్పారు. అక్క‌డ ఉన్న కార్ల‌కు కూడా బుల్లెట్లు దిగి ఉన్నాయి.  తెల్ల‌దుస్తుల్లో అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌వుతున్న వారిని టార్గెట్ చేసి కాల్పులు జ‌రిపిన‌ట్లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. క్రైమ్ సీన్ వ‌ద్ద 60 బుల్లెట్ షెల్స్ ఉన్న‌ట్లు పోలీసులు చెప్పారు. న‌గరంలో జ‌రుగుతున్న హింస‌ను అడ్డుకునేందుకు ప్ర‌త్యేక ద‌ళాలను మోహ‌రించిన‌ట్లు న‌గ‌ర మేయ‌ర్ లోరీ లైట్‌ఫూట్ ప్ర‌క‌టన చేసిన కొన్ని క్ష‌ణాల‌కే ఈ ఘ‌ట‌న జ‌రిగింది. గ‌త వారం నుంచి చికాగోలో జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌ల్లో సుమారు 70 మందికి గాయాల‌య్యాయి. దాంట్లో 11 మంది మృతిచెందిన‌ట్లు స‌మాచారం.  


logo