మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Sep 28, 2020 , 12:48:19

ఇండొనేషియాలో కొండచరియలు విరిగిపడి 14 మందికిపైగా మృతి

ఇండొనేషియాలో కొండచరియలు విరిగిపడి 14 మందికిపైగా మృతి

మాస్కో : ఇండొనేషియాలోని ఉత్తర కలిమంతన్‌ ప్రావిన్స్‌లో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు తారకన్‌ పట్టణంలోని జుటా పెర్మాయ్‌ ప్రాంతంలో నివాస సముదాయాలపై కొండచరియలు విరిగిపడి 14 మందికిపైగా మృత్యువాతపడ్డారు.  సోమవారం తెల్లవారుజూమున సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారని అక్కడి మీడియా సంస్థలు తొలుత ప్రకటించారు. చాలామంది గాయపడగా క్షతగాత్రులను స్థానికుల సాయంతో పోలీసులు చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo