సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 29, 2020 , 18:34:45

అమెరికాలో సుడిగాలి బీభత్సం : 14 మంది దుర్మరణం

అమెరికాలో సుడిగాలి బీభత్సం : 14 మంది దుర్మరణం

లేక్ చార్లెస్: దక్షిణ అమెరికా రాష్ట్రాలైన లూసియానా, టెక్సాస్‌లలో సుడిగాలి విజృంభించడంతో దాదాపు 14 మంది మృతిచెందారు. పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారని  స్థానిక మీడియా శుక్రవారం తెలిపింది. తమ రాష్ట్రంలో కనీసం 10 మంది మరణించినట్లు లూసియానా గవర్నర్ జాన్ బెల్ ఎడ్వర్డ్స్ ధృవీకరించారు. మిగతా నలుగురు వ్యక్తులు ఇండ్లు కూలిపడటం వల్ల చనిపోయారని ఎడ్వర్డ్స్ తెలిపారు. తుఫానులో పడవ మునిగిపోవడంతో మరో వ్యక్తి గల్లంతయ్యాడు.

లూసియానాలో శుక్రవారం విద్యుత్ లేకుండా ప్రజలు నానా అవస్థలు పడ్డారు. సుడిగాలి గణనీయంగా బలహీనపడటంతో టెక్సాస్ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. పలు ప్రాంతాల్లో సరైన వనరులు లేకపోవడంతో చాలా మంది నిర్వాసితులు తమ తమ ఇండ్లకు రావడానికి భయపడుతున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా పలు వ్యవస్థలు పనిచేయడం నిలిచిపోయాయి. దాంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. 

హరికేన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఈ ప్రాంతాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటించి వారికి అండగా నిలుస్తారని వైట్ హౌస్ తెలిపింది. కాగా, లారా హరికేన్ కారణంగా 31 మంది మరణించినట్లు హైతీ పౌర రక్షణ సేవ తెలిపింది. శక్తివంతమైన క్యాటగిరీ 4 హరికేన్‌గా మారడానికి ముందు గత వారాంతంలో ద్వీప దేశాన్ని ఉష్ణమండల తుఫాను పేల్చివేసింది. 


logo