శుక్రవారం 10 జూలై 2020
International - May 30, 2020 , 02:09:43

మరో ‘భూగ్రహం’!

మరో ‘భూగ్రహం’!

భూమికి 4.2 కాంతి సంవత్సరాల దూరంలో ‘ప్రాక్సిమా సెంటారి’ అనే నక్షత్రం ఉన్నది. దాని చుట్టూ తిరుగుతున్న గ్రహాల్లో ఒకటైన  ‘ప్రాక్సిమా బి’ అచ్చం భూమి మాదిరిగానే ఉన్నదని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ప్రకటించారు. 

గ్రహం: ప్రాక్సిమా బి 

నక్షత్రం: ప్రాక్సిమా సెంటారి

  • రెండింటి మధ్య దూరం: 75 లక్షల కిలోమీటర్లు  (భూమి-సూర్యుడి మధ్యదూరంలో 5శాతం) 
  • భూమి నుంచి దూరం: 40 లక్షల కోట్ల కిలోమీటర్లు (4.2 కాంతి సంవత్సరాలు)  
  • పరిమాణం: భూమికన్నా 1.17  రెట్లు 
  • పరిభ్రమణ కాలం: 11.2 రోజులు 
  • వాతావరణ ఉష్ణోగ్రత: -90డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య 
  • ప్రాక్సిమా సెంటారి ఓ మరుగుజ్జు నక్షత్రం. అందుకే ప్రాక్సిమా బి దానికి దగ్గరగానే ఉన్నా.. ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతున్నాయి. 
  • ప్రాక్సిమా సెంటారి నుంచి పెద్ద ఎత్తున ఎక్స్‌-రే కిరణాలు వెలువడుతున్నాయి. సూర్యుడి నుంచి భూమికి చేరే కిరణాలతో పోల్చితే ఇవి 400 రెట్లు ఎక్కువ. వీటిని నిరోధించే వాతావరణ పొరలు ప్రాక్సిమా బిపై ఉన్నాయో లేదో తేలాల్సి ఉన్నది. 
  • అక్కడి వాతావరణం ఎక్స్‌-రే కిరణాలను అడ్డుకోగలిగితేనే జీవం ఉనికిపై ఆశలు పెట్టుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.


logo