సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Sep 01, 2020 , 19:01:54

క‌రోనా వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికాకు త్వ‌ర‌లో ఆమోదం: ట‌్రంప్‌

క‌రోనా వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికాకు త్వ‌ర‌లో ఆమోదం: ట‌్రంప్‌

వాషింగ్ట‌న్: అగ్రరాజ్యం అమెరికాలో క‌రోనా మహమ్మారి విలయం కొనసాగుతున్న‌ది. ఇత‌ర దేశాల‌తో పోల్చితే ఇప్పటికే అత్యధిక కేసులు, మరణాలతో అమెరికా మొదటి స్థానంలో ఉన్న‌ది. ఈ నేప‌థ్యంలో సాధ్యమైనంత త్వరగా క‌రోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తీసుకురావాలని అమెరికా ముమ్మరంగా ప్రయ‌త్నిస్తున్న‌ది. అందులో భాగంగా  ఇప్పటికే దేశంలోని పలు కంపెనీలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న‌ది. ఆ దేశంలో ఇప్పటికే పలు టీకాలు ఆఖరి దశ ట్రయల్స్‌లో ఉన్నాయి. 

తాజాగా ఆస్ట్రాజెనికా అనే క‌రోనా వ్యాక్సిన్ ట్రయల్స్ మూడో దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఆ వ్యాక్సిన్‌కు తుది ఆమోదం లభిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే దేశంలో ఆఖరి దశకు చేరిన వ్యాక్సిన్ల సరసన ఆస్ట్రాజెనికా కూడా చేరిందన్నారు. 2021 జనవరి కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, సుమారు 300 మిలియన్ల డోసుల తయారీకి ఒప్పందం కుదిరిందని చెప్పారు. 

అసాధ్యం అనుకున్న పనిని అగ్రరాజ్యం సాధ్యం చేసి చూపిస్తున్న‌ద‌ని, పరిశోధకుల పనితీరు భేష్ అని అధ్య‌క్షుడు ట్రంప్‌ ప్రశంసించారు. కాగా, అమెరికాలో విరుచుకుపడుతున్న మహమ్మారి ఇప్పటికే 1.87 లక్షల మందిని పొట్టనపెట్టుకున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు 62 లక్షల మందికిపైగా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo