e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home News డెల్టా, కప్పా వేరియంట్లపై ఆస్ట్రాజెనెకా టీకా ప్రభావవంతం!

డెల్టా, కప్పా వేరియంట్లపై ఆస్ట్రాజెనెకా టీకా ప్రభావవంతం!

డెల్టా, కప్పా వేరియంట్లపై ఆస్ట్రాజెనెకా టీకా ప్రభావవంతం!

లండన్‌: భారతదేశంలో మొదటిసారిగా గుర్తించిన డెల్టా, కప్పా కరోనా వేరియంట్లపై ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ ప్రకటించింది. కరోనా నుంచి కోలుకున్న వారు, డెల్టా, కప్పా వేరియంట్లపై పరీక్షలు నిర్వహించడం కోసం ఈ టీకా ఇచ్చినవారి రక్తంలో మోనోక్లోనల్‌ యాంటీబాడీలు వృద్ధి చెందాయని, ఈ వ్యాక్సిన్‌ రెండు వేరియట్లను నిలువరించ గలుగుతుందని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ చేసిన అధ్యయనాల్లో తేలిందని ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. గతవారం పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లండ్‌ (పీహెచ్‌ఈ) వెలువరించిన విశ్లేషణలోనే ఇదే విషయం రూఢీ అయ్యిందని తెలిపింది. ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్స్‌ తీసుకున్న వారు 90 శాతానికిపైగా దవాఖానల్లో చేరాల్సిన అవసరం లేదని పీహెచ్‌ఈ పేర్కొంది. పీహెచ్‌ఈ వెల్లడించిన విశ్లేషణ ఆధారంగానే ఆక్స్‌ఫర్డ్‌ అధ్యయనం చేసిందని పేర్కొంది.

కాగా, ప్రపంచ వ్యాప్తంగా డెల్టా వేరియంట్‌ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌ఓకు చెందిన చీఫ్‌ సైంటిస్ట్‌ ప్రకటించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
డెల్టా, కప్పా వేరియంట్లపై ఆస్ట్రాజెనెకా టీకా ప్రభావవంతం!
డెల్టా, కప్పా వేరియంట్లపై ఆస్ట్రాజెనెకా టీకా ప్రభావవంతం!
డెల్టా, కప్పా వేరియంట్లపై ఆస్ట్రాజెనెకా టీకా ప్రభావవంతం!

ట్రెండింగ్‌

Advertisement