మంగళవారం 01 డిసెంబర్ 2020
International - Oct 22, 2020 , 10:04:03

ఆక్స్‌ఫ‌ర్డ్ ట్ర‌య‌ల్స్‌.. బ్రెజిల్‌లో వాలంటీర్ మృతి

ఆక్స్‌ఫ‌ర్డ్ ట్ర‌య‌ల్స్‌.. బ్రెజిల్‌లో వాలంటీర్ మృతి

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ కోసం ఆస్ట్రాజెన్‌కా, ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న టీకా ట్ర‌య‌ల్స్‌లో అపశృతి చోటుచేసుకున్న‌ది.  బ్రెజిల్‌లో ఆ టీకా తీసుకున్న ఓ వాలంటీర్ మృతిచెందిన‌ట్లు ఆ దేశ ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.  ఈ అంశంలో ఓ విచార‌ణ బృందం నుంచి డేటా సేక‌రించిన‌ట్లు ఆ శాఖ చెప్పింది. అయినా టీకా టెస్టింగ్ మాత్రం కొన‌సాగ‌నున్న‌ట్లు ఆరోగ్య‌శాఖ పేర్కొన్న‌ది.  ప్ర‌స్తుతం బ్రెజిల్‌లో మూడ‌వ ద‌శ ఆస్ట్రాజెన్‌కా ట్ర‌య‌ల్స్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ వార్త వెలుబ‌డ‌గానే ఆస్ట్రాజెన్కా షేర్లు 1.7 శాతం ప‌త‌నం అయ్యాయి.  బ్రిట‌న్‌కు చెందిన ఆస్ట్రాజెన్‌కా సంస్థతో టీకా ఉత్ప‌త్తి కోసం బ్రెజిల్ ప్ర‌భుత్వం ఒప్పందం కుదుర్చుకున్న‌ది.  బ్రెజిల్‌లో క‌రోనా వ‌ల్ల సుమారు 1,54,000 మంది మృతిచెందారు.